Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకటీగల కోనలో కాల్పులు... కానిస్టేబుల్ మిస్సింగ్... కొనసాగుతున్న కూంబింగ్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (09:31 IST)
శేషాచల అడవుల్లో మరోమారు కాల్పులు జరిగాయి. పోలీసులకు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్యన పోరాటం జరిగింది. ఇప్పటికీ కూంబింగ్ కొనసాగుతోంది. మధ్యలో కాసేపు కానిస్టేబుల్ ఒకరు తప్పిపోవడంతో పోలీసులు హైరానా పడ్డారు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుపతి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం సమీపంలోని చీకటీగల కోన ప్రాంతంలో ఎర్రదొంగలు మరోమారు రెచ్చిపోయారు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను నరికి తీసుకెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు, స్మగ్లర్లకు బీకర పోరు జరిగింది. పోలీసులు కాల్పులు జరిపారు. 
 
ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ మిస్సయ్యారు. దీంతో పోలీసులు మరింత హైరానా పడ్డారు. అయితే అరగంట తరువాత పోలీసు తిరిగిన తన బృందంలో చేరారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారనే విషయం తెలియదు. అయితే కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments