Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (17:13 IST)
రాష్ట్రంలో పలు ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్ గెజిటెడ్ కేటగిరి కిందకు వచ్చే 38 పోస్టులను భర్తీ చేయనుంది.

ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-6, ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్- 29, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లేబరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్లో ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టు, ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్- 2(ఉమెన్)- 2 పోస్టులు కలిపి మొత్తంగా 38 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సూచించారు.

నవంబర్ 12 నుంచి డిసెంబర్ ఏడో తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ సబ్ సర్వీస్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ప్రొవిజినల్గా ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. https://psc.ap.gov.in వెబ్సైట్లో, కమిషన్ కార్యాలయ నోటీస్ బోర్డులో జాబితా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments