Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనీ హంతకుడు కన్నతండ్రే.. కోపంలో చంపి నిప్పంటించాడు

నల్గగొండ జిల్లాలో దారుణం జరిగింది. కోపంలో కన్నబిడ్డను కొట్టడంతో ఆ బిడ్డ చనిపోయాడు. దీంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.... నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (11:29 IST)
నల్గగొండ జిల్లాలో దారుణం జరిగింది. కోపంలో కన్నబిడ్డను కొట్టడంతో ఆ బిడ్డ చనిపోయాడు. దీంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే.... నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలకు చెందిన బొడిగ కృష్ణయ్య అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, శేఖర్‌ బైక్‌ తీసుకెళ్లడంతో ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో తండ్రి కృష్ణయ్యకు ఇద్దరు కూతుళ్లు సోని, మానసలతో వాగ్వాదం చోటుచేసుకుంది. మానస బయటికి వెళ్లింది. మానసిక వికలాంగురాలైన సోని మాత్రం తండ్రితో వాగ్వాదం కొనసాగించింది. 
 
కోపాన్ని తట్టుకోలేని కృష్ణయ్య ఆమెపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె తల దర్వాజకు వెళ్లి తగిలింది. తల వెనుకభాగంలో బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. కంగారుపడిన కృష్ణయ్య కూతురి మృతదేహాన్ని బాత్‌రూంలోకి తీసుకెళ్లి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. కొద్దిసేపటి తర్వాత గ్రామంలో మండలం కోసం జరుగుతున్న దీక్షా శిబిరం వద్దకు వెళ్లి కూర్చున్నాడు. బాత్రూంలో కాలివున్న సోని మృతదేహాన్ని చూసి మానస వెంటనే తల్లిదండ్రుల వద్దకు వచ్చి చెప్పింది. 
 
శిబిరం వద్ద ఉన్న గ్రామస్థులందరూ సంఘటనా స్థలానికి వెళ్లారు. మండలం కోసమే ఆత్మహత్య చేసుకుందని తండ్రి తన వాదన వినిపించాడు. పోలీసులు తండ్రి కృష్ణయ్య గత చరిత్రపై విచారణ నిర్వహించారు. కృష్ణయ్యగతంలో ఓ హత్య కేసులో కారాగార శిక్ష అనుభవించాడు. పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులో తీసుకొని విచారించారు. దీంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments