Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమిస్తున్నానని చెప్పిన కుమార్తె.. గొడ్డలి కర్రతో తల పగులగొట్టిన తండ్రి...

పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుందనీ, ఎంత చెప్పినా వినడం లేదని భావించిన తండ్రి... కన్నబిడ్డపై కన్నెర్రజేయడమేకాకుండా గొడ్డలి కర్రతో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లా చంద

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (10:19 IST)
పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుందనీ, ఎంత చెప్పినా వినడం లేదని భావించిన తండ్రి... కన్నబిడ్డపై కన్నెర్రజేయడమేకాకుండా గొడ్డలి కర్రతో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో ఈ ఘటన శనివారం జరిగింది. అయితే, ఈ కేసులో మరోకోణం వెలుగుజూసింది.
 
చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన కోటయ్య అనే వ్యక్తి కుమార్తె చంద్రిక(24). ఇటీవల బీఫార్మసీ పూర్తిచేసి ఎంఫార్మసీలో చేరింది. కాలేజీ మొదలు కావడానికి కొద్దిరోజుల సమయం ఉండటంతో ఆమె ఇంటివద్దే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని తండ్రి కోటయ్య అరిచాడు. తాను స్నేహితులతో మాట్లాడుతున్నాని చెప్పింది. 
 
ఈ క్రమంలో తండ్రికూతుళ్ళ మధ్య గొడవ జరిగింది. అది కాస్త పెనుకోపానికి దారితీసి.. కూతురిపై కన్నెర్ర చేసిన కోటయ్య ఆమెను విచక్షణా రహితంగా గొడ్డలికర్రతో దాడి చేసి హతమార్చాడు. తాను ఎంతచెప్పినా వినడం లేదంటూ ఆమె ప్రాణాలు తీశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. చంద్రిక మొబైల్ డేటాను అంటే చివరిసారి ఫోనులో మాట్లాడిన నంబరును ఆరా తీశారు. ఆ ఫోన్ నంబరు చంద్రిక ప్రియుడిదిగా గుర్తించారు. దీంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తమ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు అంగీకరించాడు. తమ ప్రేమ విషయాన్ని చంద్రిక ఇంట్లో చెప్పడంతోనే ఈ దారుణం జరిగిందని వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments