Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాస్ బుక్కుల స్కామ్: 17వేల నకిలీ పాస్ బుక్కుల స్వాధీనం

Webdunia
ఆదివారం, 5 జులై 2015 (13:30 IST)
అనంతపురం జిల్లాల్లో నకిలీ పట్టాదారు పాస్ బుక్కుల స్కామ్ వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ధర్మవరం కేంద్రంగా గడచిన 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ దందాపై తాజాగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని బత్తలపల్లి మండలంలోనే ఏకంగా 17వేల నకిలీ పాస్ బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగానూ నకిలీ పాస్ బుక్కులు జారీ అయ్యాయనే వాదన కూడా వినిపిస్తోందని జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు చెప్పారు.
 
ఓవీఆర్వో సహకారంతో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, ప్రైవేట్ వ్యక్తులు జట్టుకట్టి ఈ నకిలీ దందాను నడిపినట్లు ఆధారాలున్నాయని రాజశేఖర బాబు పేర్కొన్నారు. ఇప్పటికే 12 మంది నిందితులను పట్టుకున్నామని, పరారీలోని నిందితులను కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

Show comments