Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ కేవీ రామ్‌హర్షకు ఫేస్‌బుక్ నుంచి పిలుపు.. కాలిఫోర్నియాలోని ఆఫీసుకు రమ్మన్నారు..

విశాఖపట్నానికి చెందిన కేవీ రామ్‌హర్షకు ఫేస్‌బుక్ నుంచి పిలుపు వచ్చింది. ఇందుకు అతడు ఇమూక్స్ రూపొందించడమే కారణం. వ్యాపారసంస్థల్లో డేటా మేనేజ్‌మెంట్ మరింత సులభమయ్యేలా సరికొత్త బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ టూ

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (10:24 IST)
విశాఖపట్నానికి చెందిన కేవీ రామ్‌హర్షకు ఫేస్‌బుక్ నుంచి పిలుపు వచ్చింది. ఇందుకు అతడు ఇమూక్స్ రూపొందించడమే కారణం. వ్యాపారసంస్థల్లో డేటా మేనేజ్‌మెంట్ మరింత సులభమయ్యేలా సరికొత్త బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ ఆవిష్కృతమైంది. దీనికే ఇమూక్స్ అనే పేరు పెట్టారు. దీన్ని రామ్ హర్ష రూపొందించారు. రామ్ హర్ష.. ఈ ఏడాదే రాజాంలోని జీఎంఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. 
 
డేటా మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్‌ ప్రోగ్రామ్‌ను అభివృద్ధిపరచి ఇమూక్స్‌ అని దానికి పేరు పెట్టాడు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ తరహా ఉత్పత్తులకు ఇమూక్స్ భిన్నమైందని.. దీన్ని అందరూ ఉపయోగించుకోవచ్చునని తెలిపాడు. దీన్ని పరిశీలించిన ఫేస్ బుక్ సంస్థ తమ కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపునిచ్చింది. ఇమూక్స్‌ను పరిశీలించిన ఫేస్‌బుక్‌ సంస్థ రామ్‌హర్షను కాలిఫోర్నియాలోని తమ కార్యాలయానికి ఆహ్వానించింది. 
 
తమ విద్యార్థి రామ్‌హర్ష ఇమూక్స్‌ను రూపొందించడం, అమెరికా నుంచి పిలుపు రావడంపై కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రసాద్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇంకా రామ్ హర్ష కుటుంబీకులు సైతం హర్షం వ్యక్తం చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments