Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్సైజ్ ఠాణాలో కీచకపర్వం... నిందితుడి భార్యపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

ఖమ్మం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కీచకపర్వం జరిగింది. నిందితుడి భార్యపై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అదీకూడా పీకల వరకు మద్యం సేవించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (08:44 IST)
ఖమ్మం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కీచకపర్వం జరిగింది. నిందితుడి భార్యపై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అదీకూడా పీకల వరకు మద్యం సేవించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఖమ్మంలోని రంగనాయకగుట్టకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ బెల్ట్‌ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడి బెల్ట్‌షాపుపై ఎక్సైజ్‌ పోలీసుల దాడి చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను ఎక్సైజ్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్‌కు తోడుగా అతడి భార్య కూడా స్టేషన్‌కు వెళ్లింది. ఆదేసమయంలో ఎక్సైజ్‌ కార్యాలయంలోనే కానిస్టేబుల్‌ నరేందర్‌తో పాటు మరో ఇద్దరు మద్యం తాగుతూ కనిపించారు. 
 
అపుడు మద్యం మత్తులో ఆటో డ్రైవర్ భార్యపై నరేందర్‌తో పాటు.. మిగిలిన ఇద్దరూ దురుసుగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు నరేందర్‌ను సస్పెండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments