Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (15:16 IST)
"ఒకే దేశం - ఒకే ఎన్నిక" పేరుతో నిర్వహించాలని భావించే జమిలి ఎన్నికలపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంలో రాజకీయ కోణం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నికపై తిరుపతిలో జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు.
 
జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం మినహా మరేమీ లేదన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయించడంపై ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం ఏమాత్రం సబబు కాదన్నారు. 
 
కాగా, కేంద్రం జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపుతోందన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఒకే దేశం - ఒకే ఎన్నికపై మేధావుల సదస్సును నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments