Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుచరుల కోసం పార్టీ మారిన ఆదినారాయణ రెడ్డి.. టీడీపీ షాక్

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (14:08 IST)
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో కీలక నేతగా చెలామణి అయిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ మరుక్షణమే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పిన నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
 
కాగా, 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలకంగా వ్యవహరించారు.
 
ఆటు పిమ్మట 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అదేసమయంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. పార్టీ అనుచరుల కోసం పార్టీ మారాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటా గతంలో వ్యాఖ్యానించారు. 
 
ఈ క్రమంలో ఇటీవల బీజేపీలో చేరేందుకు ఓసారి ఢిల్లీ వెళ్లారు. కొన్ని కారణాల వల్ల అప్పట్లో చేరలేకపోయారు. అయితే సోమవారం నాడు ఢిల్లీ వేదికగా జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పేసుకున్నారు. కాగా కడప జిల్లాలో టీడీపీ కీలకనేతగా ఉన్న ఆది బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments