Webdunia - Bharat's app for daily news and videos

Install App

కసి చల్లారకుంటే మర్మాంగంపై సూదులతో పొడుస్తాడు: నయీం దుశ్చర్యలపై మాజీ నక్సలైట్

ఇటీవల పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నయీం కారణంగా తీవ్రంగా నష్టపోయిన, చిత్రహింసలకు గురైన మాజీ నక్సలైట్లు ఒక్కొక్కరుగా మీడియా

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (12:19 IST)
ఇటీవల పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నయీం కారణంగా తీవ్రంగా నష్టపోయిన, చిత్రహింసలకు గురైన మాజీ నక్సలైట్లు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మావోయిస్టులను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన ఓ మాజీ నక్సలైట్... నయీం చేతిలో ఏ విధంగా వేధింపులకు గురైంది పూసగుచ్చినట్టు వివరిస్తున్నాడు. 
 
తన మాట వినని వారి పట్ల నయీం ఏ విధంగా ప్రవర్తిస్తాడో వివరించాడు. 'ముందు ప్యాంటు విప్పించి పిరుదుల మీద గుండుసూదులతో గుచ్చుతాడు. బంగారం, ఇనుము నమిలిస్తాడు. తీవ్రంగా కొట్టి తర్వాత ఓ పదివేలు ఇచ్చి వైద్యం చేయించుకోమంటూ ఇంటికి పంపిస్తాడు. తన కసి చల్లారకపోతే మార్మాంగంపైనా సూదులతో పొడుస్తాడు. ఆపై కారం చల్లిపిస్తాడు' అని ఓ మాజీ నక్సలైట్‌ చెప్పాడు. 
 
ఏ హోదా నాయకుడు లొంగిపొయినా విధిగా తనను కలవాలని కోరుకోవడం వెనుక నయీం అభద్రతా భావమే కారణం అంటారు. వారు ఎదిగి తనకు స్పాట్‌ పెడుతారన్నదే అసలు భయం అని చెబుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామరక్షక దళం వ్యక్తి 'నయీమ్‌ ఎవరు? ఏం పీకుతాడు?' అన్నాడన్న విషయం తెలిసింది. అంతే.. రెండు రోజుల్లో అతణ్ని పట్టుకొని మర్మాంగాలు కొసి జేబులో పెట్టారని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments