Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వులు పూయించిన మాజీ మంత్రి స్పీచ్... లోకేష్‌లా 'పప్పు'లా జగన్ తయారు కాగలరా?

కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరిన మాజీ మంత్రి పార్థసారధి చేసిన ప్రసంగానికి వైకాపా నేతలు పగలబడి నవ్వారు. వైకాపా అధినేత జగన్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు సమానంకాదంటూ మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమో

Webdunia
సోమవారం, 1 మే 2017 (13:23 IST)
కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరిన మాజీ మంత్రి పార్థసారధి చేసిన ప్రసంగానికి వైకాపా నేతలు పగలబడి నవ్వారు. వైకాపా అధినేత జగన్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు సమానంకాదంటూ మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పార్థసారధి తనదైనశైలిలో నవ్వులు పూయిస్తూ కౌంటర్ ఇచ్చారు. 
 
ఇటీవల మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, తమ యువ నేత లోకేష్‌కు జగన్ పోటీ కాదని వ్యాఖ్యానించారు. దీనిపై పార్థసారధి స్పందిస్తూ.. "జగనంట... ఏ రోజుకీ లోకేష్‌కు సమానం కాదంట. ఎట్లా సమానమవుతారండీ? నాలాగా, లోకేష్‌లాగా, పప్పులా జగన్ తయారుకాగలరా? అని అడుగుతా ఉన్నాను. కాలేడు. ఏనాడైనా సరే జగన్ మోహన్ రెడ్డి మైకు పుచ్చుకుని, ఈ రాష్ట్రంలో తాగునీరు లేకుండా చేయగలనని చెప్పారా?
 
ఏరోజైనా సరే, జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పగలరా? అని అడుగుతా ఉన్నాను. కరెక్టే సోమిరెడ్డి గారూ... ఏరోజూ లోకేష్‌కు జగన్ సమానం కాదని చెబుతా ఉన్నాను. జగన్‌కీ లోకేష్‌కీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. లోకేష్‌ను కించపరిచేందుకుకే సోమిరెడ్డి జగన్‌తో పోలికను తెచ్చినట్టు అనుమానంగా ఉంది" అని ఎద్దేవా చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments