Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభలేఖలు పంచి ఇంటికొచ్చిన యువతి దారుణ హత్య.. ఎలా?

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. తన పెళ్లికి రావాలంటూ ఆహ్వాన పత్రికలు పంచి ఇంటికొచ్చిన యువతి ఆపై శవంగా తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ మృతురాలి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. ఇపుడు చావు మేళాలు మోగుతున్నాయి. 
 
పోలీసులు కథనం మేరకు... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య (23) అనే యువతి గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. బ్యాంకుకు సమీపంలోనే ఓ ఇంటి మొదటి అంతస్తులో తన తల్లిదండ్రులు న్యాలకంటి లక్ష్మీరాజ్యం, మణెమ్మలతో కలిసి నివసం ఉంటోంది. 
 
ఈ క్రమంలో దివ్యకు వరంగల్ పట్టణానికి చెందిన ఓ యువకుడితో వివాహ నిశ్చితార్థం జరిగింది. మరోవారం రోజుల్లో వివాహంజరుగనుంది. దీంతో దివ్య తన పెళ్లి పనుల్లో నిమగ్నమైంది. శుభలేఖలు ముద్రించి, వాటిని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిణీ చేస్తూ వచ్చింది. ఇందులోభాగంగా, మంగళవారం బ్యాంకులో తనతోపాటు పనిచేసే సిబ్బందికి ఆమె శుభలేఖలు పంపిపెట్టి సాయంత్రానికి ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు లేరు. 
 
దీంతో తనకు కాబోయే భర్తతో ఫోనులో మాట్లాడుతూ మిద్దెపై కూర్చొనివుంది. ఇంతలో ఆమె ఒక్కపెట్టున పెద్దగా అరిచి... కుప్పకూలిపోయింది. అటు నుంచి ఏమైందని అడుగుతున్నా సమాధానం లేకపోవడంతో ఆయన బ్యాంకుకు ఫోన్ చేసి చెప్పాడు. వారు వెంటనే ఆమె ఇంటికి వచ్చి చూసి హతాశులయ్యారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దివ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపంచానామాకు పంపించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, దివ్యను పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని చెప్పారు. దివ్య తల్లిదండ్రులు ఇంట్లో లేని విషయం తెలుసుకున్న నిందితుడు నేరుగా ఇంటికి వెళ్లి హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. 
 
మరోవైపు, ఈ హత్యను వేములవాడకు చెందిన వెంకటేశం అనే యువకుడే చేసివుంటాడని దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 8వ తరగతిలో దివ్యతో కలిసి చదువుకున్న వెంకటేశం.. ఆ తర్వాత ప్రేమ పేరుతో వేధించాడని, అప్పట్లో కేసు పెట్టడంతో ఆ గొడవ సద్దుమణిగిందని, మళ్లీ రెండు నెలల నుంచి ప్రేమ పేరుతో వేధింపులు మొదలుపెట్టాడని వారు బోరున విలపిస్తూ చెప్పారు. 
 
దీంతో మరోమారు అతడిపై కేసు పెట్టగా, అతడి తల్లిదండ్రులు వచ్చి తమ కుమారుడు దివ్య జోలికి రాడంటూ రాసి ఇచ్చినట్టు చెప్పారు. కుమార్తెకు పెళ్లి చేస్తే వేధింపులు తగ్గుతాయని భావించామని, కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని విలపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments