Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ స్కిల్ కాలేజీల్లో ఇంగ్లీష్ లెర్నింగ్ ల్యాబ్స్ ఏర్పాటు

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:54 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త్వరలో ఏర్పాటుకానున్న స్కిల్ కాలేజీల్లో ఇంగ్లీష్ లెర్నింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది.  తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో సంస్థ ఎండి ఎన్. బంగారరాజు, కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంగ్లీష్ (రీజినల్ డైరెక్టర్, దక్షిణాసియా) టికె అరుణాచలం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 
 
 
ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు మాట్లాడుతూ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అందించే సర్టిఫికెట్లకు మార్కెట్లో మంచి విలువ ఉంటుందని, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో పని చేయాలనుకుంటున్న యువత తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి చాలా ఉపయోగపతాయన్నారు.   
 
 
ఒప్పందం ప్రకారం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో లాంగ్వేజ్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రాల్లో ఇంగ్లీష్ ల్యాంగ్వేజ్ ట్రైనింగ్ స్ట్రాటజీ, బెంచ్ మార్కింగ్, పాఠ్యప్రణాళిక, అసెస్ మెంట్, లెర్నింగ్ మెటీరియల్స్, టీచర్ ట్రైనింగ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అమలవుతాయి. వీటిని ఎపిఎస్‌ఎస్‌డిసి పర్యవేక్షిస్తుంది. స్కిల్ కాలేజీల్లో విద్యార్థుల నైపుణ్యాల స్థాయి ఆధారంగా డిజిటల్ క్లాస్ రూమ్, బ్లెండెడ్ లెర్నింగ్ మాడ్యూల్స్ పై శిక్షణ ఇస్తారు. ఆసమయంలో వారి సామర్థ్యాలను అంచనా వేసి కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి అంతర్జాతీయం గుర్తింపు పొందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ తోపాటు మరియు కామన్ యూరోపియన్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ లాంగ్వేజెస్ (CEFR) స్కోర్ కార్డ్‌ అందిస్తారు. కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ యొక్క ఎగ్జిక్యూషన్ పార్టనర్ అయిన లాంఛ్ ప్యాడ్ ఎల్ ఎల్ సి వారు ఎపిఎస్‌ఎస్‌డిసి ద్వారా రిజిస్టర్ అయిన లబ్ధిదారులందరికీ లెర్నింగ్ పోర్టల్, మొబైల్ యాప్ కు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు.  
 
 
ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు, కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంగ్లీష్ (రీజినల్ డైరెక్టర్, దక్షిణాసియా) టికె అరుణాచలం సీజీఎం కార్పొరేట్ కనెక్ట్ సత్యప్రభ, లాంచ్‌ప్యాడ్ ఎఎల్ఎస్సీ ప్రైవేట్ లిమిటెడ్, జీసీబీ డైరెక్టర్ ముత్తుకుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments