Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం: మంత్రి కన్నబాబు

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (18:16 IST)
మూడు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సరుగుడు, జామాయిల్ రైతులను సాయం అందించటానికి వచ్చే అగ్రికల్చర్ మిషన్ నాటికి పరిష్కార మార్గాలతో రమ్మని సీఎం జగన్ సూచించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఎక్కడైతే దుర్భిక్ష ప్రాంతాలు, తక్కువ వర్షప్రాంతాల్లో (మిల్లెట్స్) చిరుధాన్యాల సాగును ప్రోత్సహించమని చెప్పారు.

"గత సమావేశంలో మిల్లెట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. రైతులను చిరుధాన్యాల వైపు వెళ్లటానికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎఫీల ద్వారా (ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్) ఏ విధంగా మనం ప్రాసెసింగ్ యూనిట్ తెరిపించి వారికి సహాయం చేయాలి. దీనివల్ల పంటలు అన్నింటినీ మనమే డిస్ట్రిబ్యూట్,మార్కెట్ చేయటానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. 

 
పంట వేయటం ఒక ఎత్తైతే, దాన్ని మళ్లీ చేతికి వచ్చే వరకు దాన్ని కాపాడటం మరో ఎత్తు. ఏ దశలోనూ రాజీపడొద్దని సీఎం చెప్పారు. ఎక్కడ నుంచి నిపుణులు, శాస్త్రవేత్తలు, మార్కెట్ ఇంటెలిజెన్స్ సమాచారం కావాలంటే అవన్నీ తెప్పించుకోండని దీనికి అవసరమైన సహకారం ప్రభుత్వం వైపు నుంచి ఉంటుందని సీఎం చెప్పారు. 

చంద్రబాబు నాయుడు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పడ్డారు. దాదాపు రూ2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ చెల్లిస్తామని జగన్ వెల్లడించారు. ఆ ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు ఈ నెలలో అందచేయటానికి ఏర్పాట్లు చేయమని అధికారులను ఈ సమావేశంలో ఆదేశించారు. ఇది చాలా పెద్ద రిలీఫ్" అన్నారు.

వచ్చే నెల అక్టోబర్ 15 నాటికి రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకం అమలు కానున్నదని ఈ లోపు ఇన్ పుట్ సబ్సిడీ అందితే రైతులకు కాస్త వెసులుబాటు వస్తుందని సీఎం గారి ఉద్దేశమని కన్నబాబు తెలిపారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుకు సంబంధించి అవసరమైన ఏదైనా మేం తీర్చటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

"టమోటా మార్కెట్ ఎప్పుడూ హెచ్చుతగ్గులకు గురవుతోంది. మేజర్ మార్కెట్లు అయిన హైదరాబాద్, బెంగలూరు, చెన్నై, మన రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లోకి ట్రాన్స్ పోర్టు చేయమని చెప్పారు. మార్కెటింగ్ శాఖ అధికారులకు దీనికి ప్రత్యేకంగా ఉంచమని చెప్పారు. టమోటాలు, ఉల్లిపాయల మీద చర్చ జరిగిందని" కన్నబాబు తెలిపారు.

ఉల్లి ఏ టైంలో మనకు ఉత్పత్తి అవుతోంది? అప్పుడు ధరలు  ఎలా ఉన్నాయో.. గ్రాఫ్స్ తో సహా చర్చ జరిగిందని కన్నబాబు వివరించారు. "ప్రతి సంవత్సరం ఉల్లి, టమోటా సంక్షోభం చూస్తున్నాం. ఈ సంవత్సరం రాకూడదని చూస్తున్నాము. ప్రతి సంవత్సరం రేటు పడిపోయిన తర్వాత ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. కానీ ఈసారి ఇంకా టమోటా మార్కెట్ రాకమునుపే ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

ముందు చూపుతో ప్రతి రైతును ఆదుకోవాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ.3,000 కోట్లతో ధరలస్థిరీకరణ నిధిని బడ్జెట్ లోనే జగన్ కేటాయించారు. బడ్జెట్ ఎక్కడ నుంచి ఇవ్వాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. ధరల స్థిరీకరణ నిధి నుంచి నేరుగా కేటాయించవచ్చని" కన్నబాబు తెలిపారు. 

"రైతులకు ఎక్కడైతే ఇన్ పుట్ ఇవ్వాల్లో మనం గట్టిగా పనిచేయాలి. మళ్లీ రైతులకు పంట ఉత్పత్తి అయ్యాక (ఔట్ పుట్) మార్కెట్ చేసే వరకు రైతు వెంట ఉండాలని వైయస్ జగన్ చెప్పారు. మినుములు, పెసలు, కందులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను సీజన్ కంటే 15 రోజుల ముందుగా ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

 
మినుములు, పెసలు, కందులకు సంబంధించి గత అనుభవాలతో పోల్చుకుంటే మార్కెట్ లో ధరల హెచ్చుతగ్గులు గురవుతున్నాయి. రైతు పండించిన మొదటి బస్తా మార్కెట్ వచ్చేసరికే మీరు సంసిద్ధంగా ఉండండని అధికారులకు చెప్పారు. వాటికి అవసరమైన వసతులను ఏర్పాటు చేసుకోండని అధికారులను ఆదేశించారు.

నవంబరు 1 నుంచి కావాలని అధికారులు చెప్పగా.. అక్టోబర్ 15 నాటికి అంతా సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. అక్టోబరు 15 నాటికి అపరాల కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని" కన్నబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments