Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌ది రోజులుగా కనిపించని ఛైర్మన్... ప్రైమ్ 9 ఉద్యోగుల ఆందోళ‌న‌!

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:27 IST)
ప్రైమ్ 9 న్యూస్ ఛాన‌ల్ ఆర్ధిక సంక్షోభంలో ప‌డిందా? ఇప్ప‌టికే చాలా చాన‌ళ్ళు మూసివేసిన‌ట్లు, ఇది కూడా మూత‌ప‌డిపోతోందా? ప‌రిస్థితులు చూస్తూ, అవును అనే అనిపిస్తోంద‌ని ఆ ఛాన‌ల్ ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నారు. ప‌ది రోజుల నుండి ఛాన‌ల్ ఛైర్మ‌న్ కనిపించక త‌ల్ల‌డిల్లిపోతున్నారు. 
 
 
అమెరికా నుండి తక్కువ వడ్డీకి 100 కోట్లు అప్పు తెచ్చి ఛాన‌ల్ ఛైర్మ‌న్ , దాని తాలూకు ఇన్ స్టాల్ మెంట్  మూడు నెలల నుంచి అమెరికా బ్యాంక్ లకి కట్టలేక, తప్పించుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఛాన‌ల్   చైర్మన్ రఘువీర్ శ్రీనివాస్ త‌మ కార్యాల‌యంలో కూడా క‌నిపించ‌డం లేదని సిబ్బంది గ‌గ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఏపీ తెలంగాణ లో ఉన్న అని కేబుళ్ళ‌లో ప్రైమ్9 న్యూస్ ఛాన‌ల్ నిలిచిపోయింది. కొత్త వచ్చిన సైదాబాబు నేతృత్వంలో మ‌ళ్ళీ పుంజుకోవాల‌ని ఆఖ‌రిగా స‌మావేశం పెట్టారు. ఛాన‌ల్ త‌ర‌ఫున క్యాలెండర్ కోసం యాడ్స్ తేవాల‌ని ఏపీ, తెలంగాణలో ఆఖ‌రిగా సమావేశాలు పెట్టారు. ఒకొక్క రిపోర్ట‌ర్ కి టార్గెట్లు పెట్టి, మొత్తం రెండు కోట్ల రూపాయల యాడ్ తేవాల‌ని టార్గెట్ పెట్ట‌డంతో రిపోర్ట‌ర్లు, సిబ్బంది అయోమయంలో ప‌డ్డారు. 
 
 
గ‌త 4 నెలల నుంచి రిపోర్టర్ల‌కు, కెమెరా మ‌న్ ల‌కు జీతాలు లేవ‌ని, ఇప్పటికే 7 జిల్లాలో జీతాలు ఇవ్వలేదని కెమెరాలు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నార‌ని సిబ్బంది చెపుతున్నారు. డెస్క్ లో పనిచేసే ఇంఛార్జీలకి జీతాలు ఇవ్వకపోవడంతో కంప్యూటర్ల‌ను ఇంటికి తీసుకుపోయే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.  ఇక డెస్క్ లో పని చేస్తున్నవారికి అండలేక అల్లాడిపోతున్నారు. ఛానెల్ నిర్వకంతో పలువురు ఉద్యోగులు  ఆత్మహత్య యత్నంకు పాల్ప‌డుతున్నారు.


క్యాలెండర్ పేరుతో ఇప్పటికే 20 లక్షల రూపాయలు వసూలు చేసిన సైదాబాబు, రూ2 కోట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే ఛానెల్ నుండి తప్పుకునే ఆలోచనలో సైదాబాబు ఉండ‌గా, క్యాలెండర్ టార్గెట్ పూర్తి చేసి వెళ్లాలని సైదాబాబు కి జనసేన మీడియా ఇంచార్జి హరిప్రసాద్ తో వత్తిడి చేయిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments