వైకాపా అధ్యక్షుడు జగన్‌కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (19:31 IST)
వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. వైకాపా శాశ్వత అధ్యక్షుడుగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నిక చెల్లదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో ఈసీ ప్రస్తావించింది. ఇటీవల జరిగిన వైకాపాలో ప్లీనరీ భాగంగా వైకాపా శాశ్వత అధ్యక్షుడుగా జగన్‌ను ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్న విషయం తెల్సిందే. 
 
వివిధ మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తలను చూసిన కేంద్ర ఎన్నికల సంఘం చూసిన తర్వాత, ఇది వాస్తవమేనా? అని నిర్ధారించుకునేందుకు విజయిసాయి రెడ్డికి పలుమార్లు లేఖలు రాసింది. అయితే, ఈ లేఖలకు సాయిరెడ్డి నుంచి స్పందన రాకపోవడంతో ఇది వాస్తవమేనని తాము భావిస్తున్నాని దీనిపై పార్టీలో అంతర్గత విచారణ జరిపి, అసలు విషయమేమిటో తెలుపాలంటూ తాజా లేఖలో సాయిరెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 
 
పైగా, ఈ లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరుగుతూ ఉండాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అదేసమయంలో ఏ పార్టీలో అయినా ఓ నేత శాశ్వత అధ్యక్షుడుగాగానీ, ఆ నేతకు శాశ్వత పదవులుగానీ వర్తించవని కూడా ఈసీ స్పష్టం చేసింది. 
 
ఏ పార్టీ అయినా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే జరగాల్సివుందని తెలిసింది. జగన్ శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నికై ఉంటే వైకాపా నిర్ణయం ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు విరుద్ధమేనని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments