Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

ఠాగూర్
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (18:10 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. అమరావతి నిర్మాణ పనులకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇస్తూ సీఆర్డీయేకి ఈసీ లేఖ రాసింది. 
 
ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. కృష్ణా - గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాలతో పాటు విజయనంగరం - శ్రీకాకుళం - విశాఖపట్టణం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెల్సిందే. 
 
ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!! 
 
తెలుగు చిత్రపరిశ్రమలో మత్తుకళ్లతో మనసులను కొల్లగొట్టిన శృంగార తార సిల్క్‌ స్మిత. ఒకపుడు టాలీవుడ్‌ను ఏలేశారు. ఆమె డేట్స్ కోసం అనేక మంది దర్శక నిర్మాతలు, హీరోలు వేచివుండేవారు. అలాంటి నటి సిల్క్‌ స్మిత చనిపోయి చాలా రోజులైంది. కానీ ఆమె మృతి మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. తాజాగా సీనియర్ నటి జయశీల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. 
 
తాను, సిల్క్ స్మిత ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాం. సిల్క్ స్మిత చాలా మంచి అమ్మాయి. చాలా కష్టపడి పైకివచ్చింది. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను ఎదుర్కొంది. ఎవరైనా ఏదైనా అంటే తిరిగి ఏమీ అనేది కాదు. ఆ విషయాన్ని మాత్రం మరిచిపోకుండా మనసులో పెట్టుకునేది. తనని చులకనగా చూసిన హీరోల ముందే సెట్లో కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం ఆమెకే చెల్లింది. 
 
సిల్క్ స్మితతో ఓ వ్యక్తితో కలిసివుండేది. అతను ఆమె సంపాదించినదంతా లాగసుకున్నాడు. కానీ, సిల్క్‌ స్మిత మాత్రం అతని కొడుకుతో ప్రేమలోపడింది. ఆమె మరణానికి అది కారణమై ఉండొచ్చు. సిల్క్ స్మిత పెళ్లి చేసుకోవాలనీ, తల్లిని అనిపించుకోవాలని బలంగా ఉండేది. పాపం ఆ కోరిక నెరవేరకుండానే ఆమె భౌతికంగా దూరమైంది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా పుట్టిన రోజుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!!

Shekar Basha- జానీ మాస్టర్ తర్వాత శేఖర్ బాషాపై శ్రేష్టి వర్మ ఫిర్యాదు.. ప్రైవేట్ కాల్ రికార్డింగ్‌లను?

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments