Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు..

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (15:18 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల భూమి కంపించింది. దాంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. 
 
తెలంగాణలోని ఖమ్మం జిల్లాల చింతకాని మండలంలో గల నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాల్లో భూమి కంపించింది. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజవర్గాల్లోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారు జామును 2.37 గంటల సమయంలో 3 నుంచి 6 కెసన్ల పాటు భూమి కంపించింది. 
 
దీంతో ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఏడేళ్ల క్రితం జనవరి 26వ తేదీన ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడు, నాగులవంచ తదితర గ్రామాల్లో ఇదే విధంగా భూమి కంపించినట్లు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Kissik Song- ఏడు కోట్లు ఆదా చేసిన శ్రీలీల.. ఎలా?

బరువెక్కుతున్న కేతిక శర్మ హృదయ అందాలు.. కుర్రాళ్లు ఫిదా!

ఎర్రచీర దర్శకుడు సి.హెచ్.సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫాంటసీ

బాల్యం నుంచే దేశభక్తి ని అలవరుసుకునేలా అభినవ్ చిత్రం - భీమ‌గాని సుధాక‌ర్ గౌడ్

అజిత్ తో మూవీ తర్వాతే కంగువ 2 చేస్తాం, దీపిక పడుకోన్ నాయిక కాదు : కేఈ జ్ఞానవేల్ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments