పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

ఠాగూర్
మంగళవారం, 12 ఆగస్టు 2025 (17:44 IST)
కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ మురళి నాయక్, వైకాపా కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంద. దీంత అక్కడ ఉద్రిక్తతతో పాటు గందరగోళం నెలకొంది. ఒకసమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన డీఎస్పీ మురళి నాయక్.. వైకాపా కార్యకర్తలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా అంటూ హెచ్చరించారు. 
 
పులివెందులలో జరుగుతున్న జట్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు డీఎస్పీ మురళీ నాయక్‌ భారీ పోలీస్ బలగంతో వైకాపా కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వైకాపా నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ నాయకుడికి ఏదో జరుగుతుందనే ఆందోళనతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా జనం పోగయ్యారు. 
 
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డీఎస్పీ మురళీ నాయక్ రంగంలోకి దిగారు. గుంపుగా ఉన్న కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. వారు ఎంత చెప్పినా వినికుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహానికి గురైన డీఎస్పీ మురళీ నాయక్... వైకాపా కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. కాల్చిపడేస్తా నా కొ... కా.. నువ్వు తాగి మాట్లాడొద్దు. ఏమనకుంటున్నావ్... పోలీస్ యూనిఫాం ఇక్కడ అంటూ గట్టిగా హెచ్చరించారు. డీఎస్పీ వార్నింగ్‌ తాలూకూ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments