Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్... కార్లలో కండోమ్స్ - మద్యం సీసాలు... అవాక్కైన పోలీసులు!

హైదరాబాద్ నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కార్లను తనిఖీ చేసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యాయరు. ఆ కార్లలో అత్యంత ఖరీదైన మద్యం బాటిళ్లతో పాటు.. కండోమ్ ప్యాకెట్లు

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (09:47 IST)
హైదరాబాద్ నగర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కార్లను తనిఖీ చేసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యాయరు. ఆ కార్లలో అత్యంత ఖరీదైన మద్యం బాటిళ్లతో పాటు.. కండోమ్ ప్యాకెట్లు ఉండటాన్ని చూసి వారు విస్తుపోయారు. ఇక్కడ అవాక్కవడానికి కొత్తేముంది అనే కదా మీ సందేహం. ఆ కార్లు అబ్బాయిలకు చెందిన కార్లు కాదు.. కొంతమంది అమ్మాయిలకు చెందిన కార్లు కావడంతో పోలీసులు అవాక్కయ్యారు. 
 
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే చర్యల్లో భాగంగా, డ్రంకెన్ డ్రైవ్‌లు, కౌన్సిలింగ్స్‌లు నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్ని నిర్వహించినా ఈ తాగుబోతుల ఆగడాలను నిలువరించలేకపోతున్నారు. ఇక్కడ కుర్రాళ్లే కాదు అమ్మాయిలు కూడా మందు ఫుల్‌గా కొట్టి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డుపై వెళ్లేవారిని హడలెత్తిస్తున్నారు. 
 
ఇక సోమవారం రాత్రి కూడా మందుబాబులను పట్టుకునేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. అపుడు మందు భామలు రోడ్లపై చేసిన హంగామా అంతాఇంతా కాదు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా తాగి వాహనం నడుపుతున్న యువతులు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి దగ్గర నాలుగు వాహనాలను ఢీ కొట్టారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కారును తనిఖీ చేశారు. అమ్మాయిల కారులో ఉన్న మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు చూసి చూసి అవాక్కయ్యారు. 
 
ఈ యువతులు ఫుల్లుగా మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో ఇద్దరు యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఒకరు బీబీఏ స్టూడెంట్ అని, మరొకరు ఆమె స్నేహితురాలని పోలీసులు తెలిపారు. వీరితో పాటు కారులో ఉన్న మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం