Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగుల చవితి రోజున భక్తుల పూజలు.. నాగుపాము, కోడెనాగులు కనిపించాయ్

నాగుల చవితి పర్వదినాన.. నాగుపాములకు తెలుగు రాష్ట్ర ప్రజలంతా పూజలు చేశారు. పుట్టల చుట్టూ ప్రదక్షణలు చేశారు. కోరుకున్న కోరికలను నెరవేర్చు తల్లీ అంటూ ప్రార్థించారు. ఇంకా నాగుల చవితి రోజున పాము కనిపిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. విశాఖ, జోడుగుళ్ల

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (11:13 IST)
నాగుల చవితి పర్వదినాన.. నాగుపాములకు తెలుగు రాష్ట్ర ప్రజలంతా పూజలు చేశారు. పుట్టల చుట్టూ ప్రదక్షణలు చేశారు. కోరుకున్న కోరికలను నెరవేర్చు తల్లీ అంటూ ప్రార్థించారు. ఇంకా నాగుల చవితి రోజున పాము కనిపిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. విశాఖ, జోడుగుళ్లపాలెంలో వాలీబాల్‌ కోర్టు వద్ద గురువారం అచ్చం పాము కనిపించింది. 
 
జోడుగుళ్ల పాలెం మత్స్యకారులు వేట పూర్తయ్యాక జోడుగుళ్ల పాలెం బీచ్‌లో ఆర బెట్టుకుంటారు. అలా ఆరబెట్టిన వలల్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నాగుపాము చిక్కుకుంది. బయటపడేందుకు వీలులేక పోవడంతో అక్కడే చుట్టుకుంది. కాగా, ఇక్కడి కోర్టులో వాలీబాల్‌ క్రీడకారులు లక్ష్మణ్‌, బుజ్జి సాధన చేస్తున్నారు. బాల్‌ వలలవైపు వెళ్లిపోవడంతో తెచ్చుకునేందుకు వీరు అటుగా పరిగెత్తారు.
 
తీరా బంతి తీద్దామనుకునే సరికి దానికి సమీపంలో పెద్దనాగుపాము కనిపించే సరికి భయంతో కేకలు వేశారు. నాగుల చవితి రోజు కావడంతో పామును చంపేందుకు ఎవరూ ఇష్టపడలేదు. దీంతో కొందరు మెల్లగా దాన్ని వలలోంచి తప్పించి తీరంలోకి వదిలేశారు. 
 
మరోవైపు పెందుర్తిలోని వుడా కాలనీలో కోడెనాగు కవిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న గణేష్‌ సుమారు అయిదున్నర అడుగులు ఉన్న కోడె నాగును చాకచక్యంగా పట్టుకున్నాడు. పామును నిర్జీవ ప్రదేశంలో వదిలేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments