Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (10:10 IST)
ఏపీ సర్కారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) పోస్టులను అర్హులై అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 1681 పోస్టులను ఆ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 
 
గ్రామాల్లో వైద్య సేవలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,032 విలేజ్ హెల్త్ క్లీనిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సేవలను అందించేందుకు ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
ఈ పోస్టులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ విధానంలో నియమించనున్నారు. ఇప్పటి వరకు దీనిలో 8,321 పోస్టుల భర్తీ కూడా పూర్తయింది. మిగిలిన పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనున్నారు.
 
వీటికి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు https://hmfw.ap.gov.in/ లేదా https://cfw.ap.nic.in/ వెబ్ సైట్లను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా.. ఈ వెబ్ సైట్లలోనే ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి.
 
రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ ఈ నెల 24 నుంచి 30వ తేదీ మధ్యలో అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ పరీక్షను నిర్వహించనున్నారు. 
 
ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. సమయం మూడు గంటలుగా నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments