Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు : డాక్టర్ కేవీపీ రామచంద్రరావు

Webdunia
గురువారం, 12 మే 2016 (20:29 IST)
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఊరూవాడాల్లో ప్రచారం చేయడంలో మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. 
 
గతంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదం స్ఫూర్తితో కోటి సంతకాల సేకరణతో ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సంతకాలతో ఈ ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. 
 
అలాగే, యూపీఏ మిత్ర పక్షాలు, భావసారూప్యత కల్గిన పార్టీలన్నీ ప్రత్యేక హోదా సాధన కోసం తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయన్నారు. అందుకే ఈ బిల్లును అడ్డుకునేందుకు బీజేపీ - టీడీపీలు కుట్రపన్ని రాజ్యసభలో ఓటింగ్ జరుగకుండా వాయిదా వేశాయని ఆరోపించారు. 
 
అయితే, తాము మాత్రం ఓ పవిత్రమైన ఆశయంతో బిల్లును ప్రవేశపెట్టామని, ఈ బిల్లు వర్షాకాల సమావేశాల్లోనైనా ఆమోదం పొందుతుందని, ఆంధ్రులకు న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు చెప్పుకొచ్చారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments