Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపు బిల్లుకు కేంద్రం బ్రేక్ : చంద్రబాబుకు మోడీ మరోషాక్

తెలగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు వర్గానికి రిజర్వేషన్లు కల్పించేందుకు త

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (08:53 IST)
తెలగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు వర్గానికి రిజర్వేషన్లు కల్పించేందుకు తయారు చేసిన బిల్లుకు కేంద్రం మోకాలొడ్డింది. ఈ మేరకు కేంద్రం ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన కాపు రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) బ్రేకులు వేసింది. దీనిని నిలిపి ఉంచాలంటూ కేంద్ర హోంశాఖకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేసింది. 
 
గత ఎన్నికల సమయంలో కాపులకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామన్న ఎన్నికల హామీ మేరకు తెలుగుదేశం ప్రభుత్వం ఈ అంశంపై బీసీ కమిషన్‌ను నియమించింది. కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా గత ఏడాది డిసెంబరులో 'ఆంధ్రప్రదేశ్‌ కాపు రిజర్వేషన్‌ బిల్లు'ను శాసనసభలో ఆమోదించింది. ఆ తర్వాత ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ దీనిని నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం నిమిత్తం పంపించారు. 
 
రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత... రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో ఈ అంశాన్ని చేర్చినట్లయితే న్యాయ వివాదాలకు తావులేకుండా కాపులకు రిజర్వేషన్‌ లభిస్తుంది. ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ సలహా, సూచనల మేరకే నడుచుకుంటారు. కేంద్ర హోంశాఖ దీనిపై డీవోపీటీ అభిప్రాయం కోరింది. అయితే... ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే డీవోపీటీ కాపు బిల్లుకు పార్లమెంటుదాకా వెళ్లకుండానే అడ్డుకట్ట వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments