Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాలర్ శేషాద్రికి తప్పిన ప్రాణముప్పు.. నిలకడగా ఆరోగ్యం!

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (12:46 IST)
గుండెపోటుకు గురైన డాలర్ శేషాద్రికి ప్రాణముప్పు తప్పింది. తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెపుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా విధులు నిర్వహిస్తున్న డాలర్ శేషాద్రి బుదవారం మధ్యాహ్నం హఠాత్తుగా గుండె పోటుకు గురైన విషయం తెల్సిందే. దీంతో ఆయనను హుటాహుడిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం డాలర్ శేషాద్రి  ఆరోగ్యం నిలకడగా ఉందని జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. డాలర్ శేషాద్రి ఆరోగ్యం నిన్నటి కంటే చాలా మెరుగుపడిందని, ప్రాణాపాయం తప్పినట్టేనని ఆయన తెలిపారు. మరో 4 గంటల్లో డాలర్ శేషాద్రికి వెంటిలేటర్‌ను తొలగించే అవకాశం ఉందని తెలిపారు. డాలర్ శేషాద్రి ఆరోగ్యం మరికాస్త కుదుటపడ్డ తర్వాత, మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తామని శ్రీనివాసరాజు వెల్లడించారు. 

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments