Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కకు అన్యాయం... డాక్టర్ బావను గొంతుకోసి హత్య చేసిన బావమరిది

తన అక్కకు అన్యాయం చేసిన బావ మరో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని బావమరింది... బావను గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:04 IST)
తన అక్కకు అన్యాయం చేసిన బావ మరో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని బావమరింది... బావను గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, కాలాపత్తర్‌ మిస్రీగంజ్‌ పూల్‌బాగ్‌కు చెందిన అర్షియాబేగం(30) మల్లేపల్లికి చెందిన డాక్టర్‌ సయ్యద్‌ మిరాజుద్దీన్‌(45)ను ఈనెల 19న వివాహం చేసుకున్నారు. వాస్తవానికి డాక్టర్‌కు ఇది మూడో పెళ్లి. తన బావ మళ్లీ వివాహం చేసుకోవడం ద్వారా అక్కకు అన్యాయం జరిగిందని మిరాజుద్దీన్‌ రెండో భార్య సోదరుడు అజీముద్దీన్‌ కక్ష పెంచుకున్నాడు. 
 
ఈనెల 21న రాత్రి మల్లేపల్లిలో ఉన్న ‘మిరాజ్‌ కార్డియో క్లినిక్‌ అండ్‌ లైఫ్‌ కేర్‌ సెంటర్‌’కు వెళ్లి మిరాజుద్దీన్‌ను డాక్టర్‌తో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన  మిరాజుద్దీన్... డాక్టర్‌ను గొంతు కోసి హతమార్చాడు. ఈ విషయం అర్షియాబేగంకు తెలిసింది. తన భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె గురువారం ఉదయం నమాజ్‌ చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
‘నా భర్త నన్ను ఎంతో ప్రేమించాడు.. ఆయన లేని జీవితం నాకు అక్కర్లేదు. ఆయన మృతదేహాన్ని ఖననం చేసిన చోటే నన్నూ ఖననం చేయండి’ అంటూ లేఖ రాసి పెట్టి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments