Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రమత్తులో డ్రైవర్.. రెండు కల్వర్టుల మధ్య బస్సు.. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Video)

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులోని ఓ కల్వర్టు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వె

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (08:31 IST)
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయంలో జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులోని ఓ కల్వర్టు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాల్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
 
వీరిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 10 మందిని గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటంతో పాటు.. బస్సు వేగంగా వెళుతుండగా, అదుపుతప్పి రెండు కల్వర్టుల మధ్య పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.
 
కాగా, ఈ బస్సు ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆరా తీశారు. తక్షణమే ప్రమాదస్థలికి వెళ్లిసహాయ చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే క్షతగాత్రులను విజయవాడకు తరలించాలని అధికారులకు మంత్రి సూచించారు. మృతదేహాలకు తక్షణమే పోస్టుమార్టం చేసి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని కూడా అధికారులను చినరాజప్ప ఆదేశించారు.

 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments