Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ అరెస్టవుతారా?

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (16:13 IST)
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారంటూ దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై దివ్వెల మాధురి కేసు పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్‌పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గ‌తంలో త‌న‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని దువ్వాడ ఫిర్యాదు చేస్తే ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అన్నారు. త‌న‌ను చంపేస్తాన‌ని కూడా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
ఇప్పటికే కూట‌మి ప్ర‌భుత్వం మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీఠ వేస్తామ‌ని అసెంబ్లీలో ప్ర‌క‌టించింద‌ని.. హోంమంత్రి అనిత కూడా ఎవ‌రైనా మ‌హిళ‌ల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పార‌ని తెలిపారు. 
 
అవి చూశాక త‌మ‌కు కూడా న‌మ్మ‌కం క‌లిగింద‌ని, త‌మ‌పైన కూడా కొంత‌మంది జ‌న‌సేన పార్టీ వాళ్లు ట్రోల్స్ చేస్తున్నార‌ని ఆరోపించారు. గ‌తంలో ఎప్పుడో దువ్వాడ శ్రీనివాస్ చెప్పుచూపించి కొడ‌తామ‌ని చెబితే ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చార‌ని అన్నారు. జనసేన పేరు చెప్పుకుంటూ పోస్టులు చేస్తున్నారని... ఆ పోస్టుల్ని చూసి చాలా మనోవేదనకు గురయ్యానని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పై రెండేళ్ల క్రితం దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఏ క్షణమైనా దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments