Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం: ఒకరు మృతి

Webdunia
ఆదివారం, 23 నవంబరు 2014 (12:13 IST)
బంజారాహిల్స్లో ఒక కారు బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఆ కారు అధిక వేగంతో వెళ్తూ రోడ్డు డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో ఆగకుండా ఆ పక్కనే వెళ్తున్న రెండు బైకులను డీ కొట్టింది. 
 
ఈ ప్రమాదంలో బైక్లపై నుంచి ముగ్గురు వ్యక్తులు కింద పడ్డారు. ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు ముందు భాగం ధ్వంసమైంది. దీంతో కారులోని యువకుడు, అతడి గర్ల్ఫ్రెండ్ కారును వదిలి అక్కడి నుంచి పరారైయ్యారు.
 
ఇంతలో అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. 
 
అనంతరం కారును సీజ్ చేసి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
కాగా తన కుమారుడి మృతి కారణమైన యువకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మృతుడి తండ్రి కుటుంబ సభ్యులతో వచ్చి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments