బ్రహ్మోత్సవం వెంకటేశ్వర స్వామికా లేక జగన్‌కా? RRR ప్రశ్న

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (18:27 IST)
బ్రహ్మోత్సవం వెంకటేశ్వర స్వామికా లేక జగన్‌కా? అన్నట్లు జరిగిందనీ, ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వకుండా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడం దురదృష్టకరం అన్నారు ఎంపి రఘురామకృష్ణ రాజు. జగన్‌కు కండువా ఎటువైపు వేసుకోవాలో కూడా తెలీలేదు, చుట్టూ ఉన్నవారైనా చెప్పలేదు అని ఎద్దేవా చేశారు.
 
ముఖ్యమంత్రి తిరుమలలో మాస్క్ పెట్టుకోలేదు. ముఖ్యమంత్రిని చూసి ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు. ముఖ్యమంత్రి నిబంధనలు పాటించాలి. ఆచార సంప్రదాయాలను గౌరవించాలి. ముఖ్యమంత్రి ఆదర్శవంతుడిగా ఉండాలి కానీ, వేలెత్తి చూపే వాడిగా ఉండొద్దు.
 
ఆచార నిబంధనలు ముఖ్యమంత్రి ఉల్లంఘించినప్పుడు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుంది అని నిలదీశారు. అసలు ముఖ్యమంత్రి జగన్ హిందువేనా....!? క్రైస్తవుడా..!? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయనీ, ముఖ్యమంత్రి ఏ మతస్తుడని క్రైస్తవులు కూడా ఆందోళనలో ఉన్నారు.
 
ముఖ్యమంత్రి ఏ మతస్థుడు అనేది స్వరూపానందేంద్ర స్వామి మాత్రమే  చెప్పగలరు. కొడాలి నాని చేయాల్సిన వ్యాఖ్యలు చేసేసి, మంత్రి హోదాలో మాట్లాడలేదు, వ్యక్తిగతంగా అన్నాను అని చెప్పడం బాధాకారం అన్నారు. మనోభావాలు దెబ్బతీసేలా కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారు.
 మంత్రిగా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తిరగబడి దాడి చేస్తారు. భవిష్యత్తులో ఇష్టానుసారంగా నిబంధనలు పాటించకుండా, వ్యవస్థ తయారవుతుందనడానికి ఇప్పుడు జరుగుతున్న ఘటనలే నిదర్శనం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments