పట్టిసీమకే కాదు పులివెందులకు కూడా నీళ్ళు తీసుకొచ్చా
మైలవరం: పట్టిసీమకే కాదు నీ పులివెందులకు కూడా నీళ్ళు తీసుకొచ్చా... అంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రతిపక్ష నేత జగన్ పైన విమర్శలు చేశారు. పట్టిసేమ దండగ అని జగన్, వైసీపీ నేతలు సీఎం చంద్రబాబును, తనను విమర్శించారని, కాని సంవత్సర కాలంలో ఒక మహా స
మైలవరం: పట్టిసీమకే కాదు నీ పులివెందులకు కూడా నీళ్ళు తీసుకొచ్చా... అంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రతిపక్ష నేత జగన్ పైన విమర్శలు చేశారు. పట్టిసేమ దండగ అని జగన్, వైసీపీ నేతలు సీఎం చంద్రబాబును, తనను విమర్శించారని, కాని సంవత్సర కాలంలో ఒక మహా సంకల్పంతో గోదావరి తల్లిని కృష్ణా నదితో అనుసంధానం చేసిన అపరభగీరథుడు చంద్రబాబు అని కొనియాడారు.
రాయలసీమలో చినీ చెట్లను బతికించి రైతుల పంటను కాపాడారని మంత్రి ఉమ అన్నారు. జన చైత్యన్య యాత్రలో భాగంగా దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం మండలంలోని వెల్వడం, తొలుకోడు, గణపవరం గ్రామాలలో పర్యటించారు. 50 కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతానికి, తాగునీరు, సాగునీరు అందిస్తామని, నాగార్జునసాగర్ కాలువలలోకి నీళ్ళు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.