Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (14:56 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింతగా బలపడింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. వచ్చే 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 
 
దీని ప్రభావం కారణంగా మంగళవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ కోస్తాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఏఎస్డీఎంఏ వెల్లడించింది. అదేసమయంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అందువల్ల ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జాలర్లు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని సూచన చేసింది. 
 
ఏపీతో పాటు తమిళనాడుకు భారీ వర్ష సూచన 
 
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారనుంది. ఇది ప్రస్తుతం తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమైవుంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉందని తెలిపింది.
 
దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎన్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి రేపు, ఎల్లుండి 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఏపీఎస్జీఎంఏ వివరించింది.
 
ఇక, రేపు, ఎల్లుండి (ఈ నెల 26, 27 తేదీల్లో) నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 28న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్జీఎంఏ తన బులెటిన్ లో పేర్కొంది.
 
నవంబరు 29న గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... విశాఖ, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కొన్ని - చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments