Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వైపు కరోనా మహమ్మారి... మరోవైపు విషజ్వరాల పంజా..

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (16:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు విష జ్వరాల బారినపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా, కరోనా, డెంగీ లక్షణాలు ఒకేలా ఉండటంతో మరింత గందరగోళానికి గురవుతున్నారు. 
 
ముఖ్యంగా, విశాఖ జిల్లాలో డెంగీ, మలేరియా, గన్యా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. 
 
మలిదశ కొవిడ్ తగ్గకుండానే విషజ్వరాలు, డెంగీ కేసులు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరపీడితుల సంఖ్యకు తగ్గట్లు ఆసుపత్రుల్లో సేవలు అందట్లేదు. 
 
ముఖ్యంగా రక్తపరీక్షలకు ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లాల్సి వచ్చి వేలల్లో ఖర్చవుతోంది. మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి భారీగా రోగులు వస్తున్నా, జ్వర నిర్ధారణ కిట్లు లేవు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ లేరు. 
 
ఉలవపాడు, కనిగిరి, కంభం, యర్రగొండపాలెం, గిద్దలూరు, పెదదోర్నాలలో సీబీపీ యంత్రాలు లేవు. 
 
చీరాల ఏరియా ఆసుపత్రిలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వంటి పరీక్షలు చేయాల్సి ఉండగా ఒక ల్యాబ్ సహాయకుడే ఉన్నారు. ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురంలో డెంగీ నిర్ధారణ పరీక్షకు సౌకర్యం ఉన్నా, ఫలితాలకు రెండు, మూడు రోజుల సమయం పడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments