Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలో డెంగ్యూ విజృంభణ

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:58 IST)
తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని మంగళగిరి లో డెంగ్యూ విజృంభిస్తోంది.తాజాగా కుప్ఫరావు కాలనీలోని 15 నెలల చిన్నారికి డెంగ్యూ పాజిటీవ్ నమోదయింది.జ్వరాలతో బాధ పడే వారు ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

టెస్టులు,చికిత్స లకు అయ్యే ఖర్చులు భరించలేక అల్లాడిపోతున్నారు.ప్లేట్ లెట్ కౌంట్ డెంగ్యూ నిర్ధారణ పరీక్షకు 2,900 వరకూ ప్రయివేట్ ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్నారు.డెంగ్యూ కేసులు నమోదవుతున్నా అటువంటిదేమి లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొట్టి పరుస్తున్నారు.

ప్రధానంగా 32 వార్డుల్లో చాలా చోట్ల ఇంటింటి కి వెళ్లి ఫీవర్ సర్వే చేయటం లేదు.మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ఎలీషా టెస్ట్ చేసే సౌకర్యం లేదు.దీనితో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలకు రూ.వేలల్లో ఖర్చవుతోంది.

చికిత్స కు ఖర్చులు భరించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.కనీసం వారానికి ఒక సారైనా వార్డులో బ్లీచింగ్ చల్లాల్సి ఉంది.తరచూ ఫాగింగ్ చేయాలి.పందుల పెంపకం దారులు ఆవుల యజమానులు వాటిని రోడ్ల పైకి వధలకుండా చూడాలి.క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణను అధికారులు ప్రతి వార్డులో నిత్యం స్వయంగా పరిశీలించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments