Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం క్షుద్రపూజలు చేయించిన ప్రేయసి.. 25 తులాల నగలిచ్చి...

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ యువతి క్షుద్రపూజలు చేయడానికి సిద్ధపడింది. దీనికోసం ఓ కోయదొర‌ను ఆశ్రయించింది. పూజకోసం 25 తులాల బంగారం ఇచ్చి పూజలు చేయమని కోరింది. ఇదే

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (11:52 IST)
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ యువతి క్షుద్రపూజలు చేయడానికి సిద్ధపడింది. దీనికోసం ఓ కోయదొర‌ను ఆశ్రయించింది. పూజకోసం 25 తులాల బంగారం ఇచ్చి పూజలు చేయమని కోరింది. ఇదే అదనుగా భావించిన ఆ దొర పూజలు చేస్తానని చెప్పి నగలు తీసుకుని ఉడాయించాడు. 
 
ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది. ప్రేమ మైకంతో ఆ యువతి ప్రేమికుడిని ద‌క్కించుకోవ‌డం కోసం ఓ కోయ‌దొర‌ను ఆశ్ర‌యించింది. దీంతో ఆమె అమాయ‌క‌త్వాన్ని, ఆసర‌గా తీసుకున్న ఆ దొర.... యువతికి దోషం ఉందని, దోష నివారణకు బంగారంతో పూజ చేయాలని చెప్పాడు. ఎలాగైనా ప్రియుడిని దక్కించుకోవాలన్న ఆశతో ఇంటి వ‌ద్ద నుంచి 25 తులాల బంగారం తీసుకువ‌చ్చి కోయ‌దొర‌కు సమర్పించింది. దీంతో అత‌డు పూజ చేస్తున్న‌ట్లుగా ఆమెను నమ్మించి న‌గ‌ల‌తో పరార‌య్యాడు. 
 
దొర తనను ఏమార్చాడన్న విషయం తెలుసుకుని లబోదిబోమని గుండెలు బాదుకుంది. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు కోయ‌దొర బంగారాన్నిమార్కెట్లో  విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ఇలాంటి దొంగ బాబాల‌ను న‌మ్మవ‌ద్ద‌ని హెచరిస్తున్నా.. ప్ర‌జ‌లు మాత్రం ఇంకా వారివైపే ఆకర్షితులు అవుతున్నారు. ఏదో సాధించాల‌నే ల‌క్ష్యంతో బురిడీ కొట్టించి న‌గ‌లు లాక్కేళ్లే వారిని ఆశ్రయించి మోస‌పోతున్నారు. ఇక‌నైనా ఇలాంటి వారిప‌ట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments