Webdunia - Bharat's app for daily news and videos

Install App

పించన్‌దారులు షాక్... తమ ఖాతాల్లో రూ.80 లక్షల బ్లాక్ మనీ డిపాజిట్

పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా పోసుకుని ఉన్న రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను ఏం చేయాలో అర్థం కావడంలేదు నల్ల కుబేరులకు. దాంతో బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై ఎలాగోలా తమ పనులు కానించేస్తున్నారు. కోట్లకు కోట్లు నల్లడబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేస

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (15:18 IST)
పెద్ద నోట్ల రద్దుతో కుప్పలుతెప్పలుగా పోసుకుని ఉన్న రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లను ఏం చేయాలో అర్థం కావడంలేదు నల్ల కుబేరులకు. దాంతో బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై ఎలాగోలా తమ పనులు కానించేస్తున్నారు. కోట్లకు కోట్లు నల్లడబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేస్తున్నారు. కొందరు బ్యాంకు సిబ్బంది కమీషన్లకు కక్కుర్తి పడటంతో నల్ల బాబులు ఎంచక్కా నల్ల డబ్బును వైట్ చేసుకుని కాలర్ ఎగరేసుకుని వెళుతున్నారు. తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపడింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో రౌతులపూడిలో ఏడుగురు పించన్ దారుల ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాలో రూ.80 లక్షలు చొప్పున నల్లధనం డిపాజిట్ అయ్యింది. ఈ డబ్బు తమకు తెలియకుండా తమ ఖాతాల్లో పడటంపై పించన్‌దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ ఖాతాల్లో జమ అయిన డబ్బు బ్లాక్ మనీ అయి ఉంటుందని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఐతే బ్యాంకు సిబ్బంది మాత్రం... సర్వర్ ఫాల్ట్ వల్ల ఇలా డబ్బు డిపాజిట్ అయినట్లు తెలియజేస్తున్నారు. కానీ బ్యాంకు సిబ్బంది మాటలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి దానిపై విచారణ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments