Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల కుబేరులకు బంపర్ ఆఫర్... హుండీలో వేయండి... నల్లను తెల్ల చేస్కోండి... రూ.1500 కోట్లు

నల్లధనం ఎవరి దగ్గర ఉందో ఎక్కడ ఉన్నదో తెలుసుకుని మరీ నల్ల కుబేరుల ముందు కొందరు వాలిపోతున్నారు. ముఖ్యంగా నల్లధనం కట్టలు కట్టలు నేల మాళిగల్లో పెట్టేసుకుని ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నవారికి హవాలా, హుండీ పెద్దలు రంగంలోకి దిగి 60:40 నిష్పత్తిలో ఆదుకు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (22:05 IST)
నల్లధనం ఎవరి దగ్గర ఉందో ఎక్కడ ఉన్నదో తెలుసుకుని మరీ నల్ల కుబేరుల ముందు కొందరు వాలిపోతున్నారు. ముఖ్యంగా నల్లధనం కట్టలు కట్టలు నేల మాళిగల్లో పెట్టేసుకుని ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నవారికి హవాలా, హుండీ పెద్దలు రంగంలోకి దిగి 60:40 నిష్పత్తిలో ఆదుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మార్గాల ద్వారా ఇప్పటికే రూ. 1500 కోట్ల నల్లధనం తెల్లధనంగా మారిపోయిందని సమాచారం. 
 
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో హుండీ, హవాలా రాయుళ్లు తిష్టవేసి నల్లధనం పోగుచేసుకున్న కుబేరుల వద్దకు వెళ్లి ప్రణాళికలు చెపుతున్నారట. ఆ ప్రకారంగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్న హుండీల్లో నల్లధనాన్ని కానుకలుగా సమర్పించేస్తున్నారట. హుండీ డబ్బు నల్లధనం అయినా లెక్క ఉండదు కాబట్టి ఎంచక్కా అది తెల్లధనంగా మారిపోతుంది. కాకపోతే ఇక్కడ నిష్పత్తి ప్రకారం మాట్లాడుకుని హుండీల్లా వేయించేస్తున్నారట. 
 
ఇంకో మార్గం డాలర్లు కొనేయడం. ఆ డబ్బును హవాలా మార్గం ద్వారా నడించేయడం. ఇలా మొత్తమ్మీద నల్ల కుబేరులు ఎక్కడ కూడా తగ్గకుండా నల్లధనాన్ని 100 పర్సెంట్ తెల్లధనంగా మార్చేసుకుంటున్నట్లు సమాచారం వస్తోంది. మరి ఈ హుండీ, హవాలా మార్గాలను నరేంద్ర మోదీ ఎలా అడ్డుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments