Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వలేదనీ... మహిళపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 24 మే 2020 (12:00 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఓ దొంగ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి కారణం.. బాధిత మహిళ ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వకపోవడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీకి చెందిన ఓ మహిళ తమ ఇంటి బాల్కనీలో కూర్చొని మొబైల్ వాడుతోంది. అదేసమయంలో ఓ 23 యేళ్ల కుర్రాడు దొంగతనం చేయడానికి ఆ ఇంటిలో చొరబడ్డాడు. ఈ విషయం గ్రహించిన ఆ మహిళ.. ఆ దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమైంది. 
 
ఆ దొంగ కత్తితో చంపుతానని బెదిరించడంతో మహిళ మిన్నకుండిపోయింది. ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులు, డబ్బు తనకు అప్పగించాలని ఆమెను బెదిరించాడు. ఆపై ఆమె బ్యాంకు ఏటీయం కార్డులు తీసుకొని వాటి పిన్ నంబర్ చెప్పాలని ఒత్తిడి చేశాడు. 
 
అందుకు ఆ మహిళ నిరాకరించింది. అంతే.. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను పారిపోయిన తర్వాత పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. సదరు దొంగ తనపై అత్యాచారం చేయడమేకాకుండా, గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసులో 23 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments