Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లిస్తావా? ఒక్కసారి పక్కలోకి వస్తావా? పీఆర్వో సెక్స్ టార్చర్

హైదరాబాద్‌లో డాన్స్ అకాడెమీని నిర్వహిస్తూ జీవనం సాగిస్తూ వచ్చిన ఓ మహిళా డైరెక్టర్‌కు అదే సంస్థలో పని చేసే పీఆర్వో ఒకరు లైంగికంగా వేధించాడు. తీసుకున్న అప్పు చెల్లించలేకుంటే ఒక్కసారి నా కోర్కె తీరిస్తే

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (09:25 IST)
హైదరాబాద్‌లో డాన్స్ అకాడెమీని నిర్వహిస్తూ జీవనం సాగిస్తూ వచ్చిన ఓ మహిళా డైరెక్టర్‌కు అదే సంస్థలో పని చేసే పీఆర్వో ఒకరు లైంగికంగా వేధించాడు. తీసుకున్న అప్పు చెల్లించలేకుంటే ఒక్కసారి నా కోర్కె తీరిస్తే సరిపోతుందంటూ టార్చర్ చేశారు. ఈ వేధింపులు భరించలేని ఆ మహిళ హైదరాబాద్ నగర పోలీసులను ఆశ్రయించడంతో ఆ పీఆర్వో బండారం బయటపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, వనస్థలిపురానికి చెందిన 32 యేళ్ళ మహిళ ఒకరు స్థానికంగా ఓ డాన్స్‌ అకాడమీ నిర్వహిస్తున్నారు. అదే అకాడమీలో పీఆర్‌వోగా ఇసాక్‌ రూబెన్‌(28) వద్ద రూ.27 వేలు అప్పు తీసుకున్నారు. ఈ అప్పు చెల్లించడంలో జాప్యమైంది. దీంతో అప్పు చెల్లించలేని పక్షంలో తనకు పడకసుఖం ఇవ్వాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. 
 
ఆ తర్వాత మరో వ్యక్తివద్ద అప్పు తెచ్చి చెల్లించింది. అయినప్పటికీ రూబెన్ తీరుమారలేదు. ఆమె ఫొటోలు మార్ఫింగ్‌ చేసి నెట్‌లో పెడతానని, అత్తమామలకు చెడుగా చెబుతానని బెదిరించాడు. అతడి వేధింపులు భరించలేక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం