Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న గన్‌మెన్‌ని గుద్దారు.. ఇప్పుడు దళిత ఉద్యోగిని తన్నారు. చంద్రబాబూ నిద్దరోతున్నారా?

మూడు రోజుల క్రితం విజయవాడ ఆర్టీఏ కార్యాలయంలో విజయవాడ తెలుగుదేశం ఎంఎల్ఏలు బోండా ఉమా, వెంకన్న తదితరులు చేసిన వీరంగం జనం ఇంకా మర్చిపోలేదు. ఇప్పడు కేబినెట్ మంత్రి అచ్చన్నాయుడు నేరుగా దళిత ఉద్యోగినిని పట్టుకుని తన్నారన్న వార్త టీడీపీ పరువును గంగలో కలిపేసి

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (09:38 IST)
తెలుగుదేశం పార్టీ పాలనలో చట్టం, న్యాయం పూర్తిగా పక్కకు పోతున్నట్లు వరుసగా సంకేతాలు వెలువడుతున్నాయి. మూడు రోజుల క్రితం విజయవాడ ఆర్టీఏ కార్యాలయంలో విజయవాడ తెలుగుదేశం ఎంఎల్ఏలు బోండా ఉమా, వెంకన్న తదితరులు చేసిన వీరంగం జనం ఇంకా మర్చిపోలేదు. ఇప్పడు కేబినెట్ మంత్రి అచ్చన్నాయుడు నేరుగా దళిత ఉద్యోగినిని పట్టుకుని తన్నారన్న వార్త టీడీపీ పరువును గంగలో కలిపేసింది.
 
విషయం ఏమిటంటే.. న్యాయం కోసం వెళ్ళిన తనను రాష్ట్ర కార్మిక శాఖమంత్రి అచ్చెన్నాయుడు పట్టుకుని తన్నారని కొరపాన కల్యాణి అనే దళిత ఉద్యోగిని విశాఖ రేంజ్‌ డీఐజీ సీహెచ్‌ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేయడం టీడీపీ వర్గాలను షేక్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఆర్‌అండ్‌బీలో ఉమెన్‌ గ్యాంగ్‌ మజ్దూర్‌గా పనిచేస్తున్న తనను ఎస్‌ఈ రామచంద్రన్‌ మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తూ ఏడాదిగా జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆమె గతంలోనే ఫిర్యాదు చేశారు.  
 
ఈ విషయమై గత డిసెంబర్‌లో న్యాయం కోసం మంత్రి అచ్చెన్నాయుడి వద్దకు  వెళితే  మంత్రి తమగోడు వినకుండా, తనని తన్నడంతో పాటు, తమ కుటుంబ సభ్యులను సెక్యూరిటీ సిబ్బందితో నెట్టివేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి వివరించగా. సీఎం సానుకూలంగా స్పందించి రూ.25 వేల నగదు ఇచ్చి సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ వర్గాలు అధికారం చాటున చేస్తున్న అరాచకాలను ఇకనైనా అరికట్టకపోతే ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకతవైపు వెళ్లిపోయే ప్రమాదముంది పార్టీ శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం