Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బీజేపీకి మరో అసెంబ్లీ సీటు వస్తుంది : బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి

వరుణ్
శుక్రవారం, 29 మార్చి 2024 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మరో అసెంబ్లీ సీటు అంటే 11వ సీటు రానుందని, ఆ సీటులో ఎవరు పోటీ చేయాలన్నది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఏపీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. తమ పార్టీలో ఉన్నపాతవారు, కొత్తవారు అందరూ బీజేపీ నేతలేనని చెప్పారు. తమ పార్టీకి ఏపీలో అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయని తెలిపారు. త్వరలోనే మరో సీటు వస్తుందన్నారు. ఆ 11వ సీటులో ఎవరు పోటీ చేయాలన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. 
 
తమ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భవితవ్యాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు. తమ పార్టీలోకి వలస వచ్చినవారికి మాత్రమే టిక్కెట్లు కేటాయించిందంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. స్థానిక పరిస్థితులు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ పక్కనపెట్టలేదన్నారు. పార్టీ హైకమాండ్ తీసుకునే పార్టీ నేతలు, కార్యకర్తలు కట్టుబడివుండాలన్నారు. కాగా, ఏపీలో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments