తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (13:33 IST)
బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది. ఇది మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది.  
 
ఈ వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారితే దానికి సెన్యార్ అని పేరు పెట్టనున్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాలు, యానాంలో ఈ నెల 29వ తేదీన భారీ వర్షాలు, 30వ తేదీన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, ఈ నెల 27, 28వ తేదీల్లో ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని హెచ్చరించింది. 
 
తమిళనాడులో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు పలు దఫాలుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న ఆరు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, కొమోరిన్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక సమీపంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉదని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments