తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (22:45 IST)
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇది శ్రీలంక తీర ప్రాంతం మీదుగా పయనిస్తూ మరింత బలపడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతూ, బంగాళాఖాతంలో కారైకాల్‌కు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుందని అధికారులు ధృవీకరించారు.
 
ఈ తుపాను ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు అత్యంత సమీపంగా రానుందని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తమిళనాడు తీరంలో అక్కడక్కడా కుండపోతగా అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదివారం దక్షిణ కోస్తాంధ్ర, తీవ్ర ప్రాంత రాయలసీమలోనూ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖను స్పష్టం చేసింది. 
 
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిసార్లు వీటి వేగం గంటకు 90 కిలోమీటర్లకు చేరుకోవచ్చని హెచ్చరించింది. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగిసిపడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో డిసెంబరు ఒకటో తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో మత్స్యకారులు వేడకు వెళ్లడాన్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments