కష్టంగా మారుతున్న ఓటుకు ప్రయాణం.. రద్దీ రద్దీ.. 

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (13:24 IST)
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తేదీ ఖరారు కావడంతో దేశం నలుమూలలా ఉన్న ఆంధ్రులు ఏప్రిల్ 11న తమ స్వస్థలాలకు వెళ్లి ఓటు వేయాలనుకుంటున్నారు. ఎన్నికల తేదీ వెలువడిన రెండు రోజులకే ఏప్రిల్ 10వ తేదీ ప్రయాణానికి లక్షల మంది ప్రజలు బస్సు, రైళ్లలో సీటు బుక్ చేసుకున్నారు. 
 
వివిధ ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు నిండిపోయాయి. దాదాపు అన్ని రైళ్లలోనూ ఏప్రిల్ 10వ తేదీ నాటికి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేకపోవడం గమనార్హం. సాధారణంగా రిజర్వేషన్ దొరకకుంటే వెయిటింగ్ లిస్ట్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు, కానీ దాదాపు అన్ని రైళ్లలో స్లీపర్, ఏసీ టికెట్లు రిగ్రెట్ కావడంతో కనీసం వెయిటింగ్ లిస్ట్‌లో కూడా బుక్ కావడం లేదు.
 
ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడుపుతున్నామని రైల్వే శాఖ చెబుతున్నప్పటికీ కూడా అవన్నీ వేసవి కాలంలో నడిపే ప్రత్యేక రైళ్లు, అవి కూడా ఎన్నికల తేదీకి ముందు కాకుండా వేరే రోజుల్లో ఉన్నాయి. దీనితో ప్రజలు బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్ సర్వీసుల వాళ్లు ఇదే అదనుగా ఛార్జీలను విపరీతంగా పెంచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments