Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక ఫీజు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులే

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (19:06 IST)
కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రైవేటు ఆస్పత్రులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పలు ఆస్పత్రులు కనీస మానవత్వం మరిచి కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తప్పు చేసిన ఆస్పత్రులకు నోటీసులు జారీచేయడం, జరిమానాలు విధిస్తూ వచ్చింది. అయితే, ఇకపై అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేస్తే పది రెట్ల పెనాల్టీ విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రెండోసారి కూడా ఇదేవిధమైన తప్పిదాలకు పాల్పడితే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ హెచ్చరించారు.

పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయన్నారు.  రాష్ట్రంలో పలు ఆసుపత్రుల నుంచి కరోనా బాధితుల డిశ్చార్జీలు పెరిగాయని, అదే సమయంలో అడ్మిషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల్లో 1,00,602 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 25 రోజుల కిందట 19 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండేవన్నారు. ఇపుడా ఆ సంఖ్య లక్షకు పైగా చేరిందన్నారు.

గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రులకు 3,927 డోసులు అందజేశామన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందజేసే 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కంటే గడిచిన 24 గంట్లో 812 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డ్రా చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం