Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి టన్ను ధైర్యం తెచ్చుకోండి.. బాబుకు నారాయణ హితవు!!

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (10:17 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ అన్నారు. అందుకే, రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక టన్ను ధైర్యం తెచ్చుకోవాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా, కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు చంద్రబాబు అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా చంద్రబాబు ధైర్యం తెచ్చుకోవాలన్నారు. కేసులతో బీజేపీ భయపెడితే న్యాయపోరాటం చేయాలని కానీ భయపడటమేంటని ప్రశ్నించారు. భయపడినకొద్దీ వారు మరింతగా లొంగదీసుకునేందుకు చూస్తారని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకుని వెళితేనే విజయం సాధించడం సులువు అవుతుందని సూచించారు. 
 
"చంద్రబాబు ఒడ్డుపొడుగులో రేవంత్ రెడ్డి సగం ఉంటాడు. మరి రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం బాబుకు లేదా? రేవంత్ రెడ్డితో మాట్లాడి టన్ను ధైర్యం తీసుకుని చంద్రబాబుకు ఇమ్మని చెప్పా. నిలబడి పోరాడితో ఏమౌవుతుంది అని ప్రశ్నించారు. కేసులు పెండింగ్‌‍లో ఉన్నా భయపడేదేముందని అన్నారు. ఒకసారి జైలుకు పోయివచ్చారు కాబట్టి చలి తీరిపోయిందని వ్యాఖ్యానించారు. ఫైట్ చేయకుండా భయపడితే మరింత లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారని నారాయణ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments