Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ బట్టల షాపుకు వస్తున్న ఆవు.. వ్యాపారం భలేగుంది..

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (12:17 IST)
బట్టల షాపుకు మనమంతా వెళ్తుంటాం. కానీ ఓ ఆవు కూడా బట్టల షాపుకు వెళ్తుందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఓ ఆవు ప్రతిరోజూ బట్టల షాపుకు వస్తోంది. ఒక్క రోజు కూడా మిస్ కాదు. రోజూ ఆ షాపుకు రావడం ఫ్యాన్ కింద సేద తీరడం చేస్తుంది. ఈ ఘటన కడప జిల్లాలోని మైదుకూరులో జరుగుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. మైదుకూరులో ఓబయ్య అనే వ్యాపారికి బట్టల షాపు ఉంది. ఆ షాపు పేరు సాయి రామ్ క్లాత్ షోరూమ్. నిత్యం కష్టమర్లతో ఎంతో రష్‌గా వుండే ఆ షోరూమ్‌కు ఓ ఆవు ప్రతిరోజూ వస్తుంది. కష్టమర్ల కోసం వేసిన మెత్తని పరుపు మీద పడుకుని చక్కగా ఫ్యాన్ కింద సేదదీరుతోంది. 
 
ఏడు నెలల పాటు ఈ తంతు జరుదుతోంది. కొత్తలో షాపులోకి వస్తున్న ఆవుని షాపు సిబ్బంది అడ్డుకున్నారు. అయినా అది ఆగకుండా వారిని నెట్టుకుని చక్కగా ఫ్యాన్ కింద తిష్ట వేసింది. దాన్ని కొట్టి బైటకు తోలేందుకు వారు యత్నించినా అది మాత్రం కదలకుండా అలాగే పడుకుంటోంది.
 
దీంతో షాపు యజమాని ఓబయ్య కూడా ఆవుని కొట్టి బైటకు తోలేందుకు యత్నించాడు. కానీ దెబ్బలు తింది కానీ కదల్లేదు. దీంతో ఓబయ్య తన వ్యాపారం దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందాడు. కానీ రోజు షాపుకు వస్తున్న ఆవుని చూసేందుకు కష్టమర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ ఆవు వల్ల తనకు వ్యాపారం బాగా కలిసి వచ్చిందనీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments