Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ బాధితుల ప్రైమరీ - సెకండరీ కాంటాక్టులను గుర్తించాలి...

Webdunia
ఆదివారం, 2 మే 2021 (09:22 IST)
అనంతపురం జిల్లాలో కోవిడ్ బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల మ్యాపింగ్ అత్యవసరంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్  గంధం చంద్రుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల మ్యాపింగ్ పెండింగులో ఉందని, పెండింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 
 
ఇప్పటి వరకూ పెండెన్సీలో ఉన్న కాంటాక్ట్ మ్యాపింగును మధ్యాహ్నం రెండు గంటల లోపు పూర్తి చేయాలని ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కోవిడ్ పాజిటివ్ కేసును 10 ప్రైమరీ కాంటాక్టులు, 21 సెకండరీ కాంటాక్టులతో మ్యాపింగ్ చేయాలన్నారు. 
 
ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి మండలాలు, మునిసిపాలిటీలు, గ్రామ/వార్డు స్థాయి టీములతో  సమన్వయ పరుచుకుని ఏరోజుకారోజు పెండెన్సీ లేకుండా చూడాలని ఇదివరకే అదేశాలిచ్చామన్నారు. పెండెన్సీ తగ్గించడంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా ప్రతి రోజూ కొన్ని కేసుల మ్యాపింగ్ పెండింగ్‌లో ఉంచడం వల్ల కోవిడ్ వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. 
 
అందువల్ల అధికారులు యుద్ధప్రాతిదికన పని చేసి జీరో పెండెన్సీ తీసుకురావాలన్నారు. 
కాంటాక్ట్ మ్యాపింగ్ విషయంలో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను మండల స్థాయి ఉద్యోగులు పట్టించుకోవడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. 
 
మండల స్థాయి అధికారులు మండల, మునిసిపల్, గ్రామ/వార్డు స్థాయిలో సరిగ్గా పని చేయకుండా వుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు..  కాంటాక్ట్ మ్యాపింగ్ చేయకుండా కోవిడ్ ను ఎదుర్కోవడం అసాధ్యమని, వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments