Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీలోకి బ్లాక్ ఫంగస్

Webdunia
సోమవారం, 17 మే 2021 (18:32 IST)
కోవిడ్ కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్ ఫంగస్' వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 
 
పాజిటివ్ కేసుల గుర్తింపు కోసం రాష్ట్రమంతా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని.. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని.. వాటికి సంబంధించిన కేసులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధికి సంబంధించిన మందులను సమకూర్చాలని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు.
 
బ్లాక్ ఫంగస్ కరోనా రోగుల పాలిట పెనుముప్పుగా మారింది. బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటిచూపు పోగొట్టుకోవడమే కాకుండా, కొన్నిసార్లు మృత్యువాత కూడా పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్‌పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారని వివరించారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments