Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయి భార్య ఉండగానే.. మరో మహిళను పెళ్లాడి దొంగగా మారారు... ఎందుకని?

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి పెళ్లయి భార్య ఉండగానే.. చనువుగా ఉన్న మరో మహిళను పెళ్లాడాడు. సక్రమంగా పనిచేయక ఉద్యోగం పోగొట్టుకున్నాడు. డబ్బు సంపాదనకు వారిద్దరూ కలిసి పగటివేళ దొంగతనాలు చేయటం ప్రార

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (09:42 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి  పెళ్లయి భార్య ఉండగానే.. చనువుగా ఉన్న మరో మహిళను పెళ్లాడాడు. సక్రమంగా పనిచేయక ఉద్యోగం పోగొట్టుకున్నాడు. డబ్బు సంపాదనకు వారిద్దరూ కలిసి పగటివేళ దొంగతనాలు చేయటం ప్రారంభించారు. తేలికగా కాసులు సంపాదించే మార్గం కావటంతో యధేచ్ఛగా చోరీలకు పాల్పడుతూ జల్సా చేస్తున్నారు. ఈ దొంగతనాలపై పలువురు ఫిర్యాదులు చేయడంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముందుగా రెక్కీ చేసి అనంతరం తెలివిగా ఆ ఇళ్లలోకి దూరి చోరీలు చేసేవారు. చాకచక్యంగా ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్న వీరి ఆచూకీని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. పూర్తి ఆధారాలతో దొంగ దంపతులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 
 
హైదరాబాద్, అంబర్‌పేట్‌ శంకర్‌నగర్‌‌కు చెందిన ఒగ్గు శ్రీనివాస్. గతంలో ఓ కంపెనీలో పని చేసేవాడు. నెలవారీ రూ.7 వేలు వేతనం వచ్చేది. వివాహమై భార్య కూడా ఉంది. అయితే, తాను పని చేసే కంపెనీలో రేణుక అనే మహిళ పరిచయమైంది. ఈమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఓ ఇంట్లో పని చేసేది. ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన సరిగాలేదని ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే, వచ్చే ఆదాయం చాలక పోవడంతో భార్యభర్తలిద్దరూ అడ్డదారిని ఎంచుకున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు దొంగలుగా మారి చివరకు పోలీసుల రెక్కీతో పట్టుబడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments